Pattikonda: దేవనకొండలో ఒంటరి మహిళపై దోపిడీ.. మూడు తులాల బంగారం లూటీ!

Pattikonda: దేవనకొండలో దారుణం జరిగింది. పత్తికొండ నుంచి వచ్చిన ఒంటరి మహిళ రత్నమ్మను వెంబడించిన దుండగులు ఇంటి సమీపంలో మూడు తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు.

G Jagadeesh, Pathikonda
Published on: 7 Sept 2026 9:36 PM IST
Pattikonda
X

Pattikonda: దేవనకొండలో ఒంటరి మహిళపై దోపిడీ.. మూడు తులాల బంగారం లూటీ!

పత్తికొండ: పత్తికొండలోని సాయిబాబా ఆలయానికి వెళ్లి తిరిగి దేవనకొండకు వస్తున్న రత్నమ్మ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు పత్తికొండ నుంచే వెంబడించినట్లు సమాచారం.దేవనకొండలోని నూర్ అహ్మద్, రహమాన్ షాపులు దాటిన అనంతరం తన ఇంటి సందులోకి వెళ్లిన సమయంలో వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని పరారైనట్లు బాధితురాలు రత్నమ్మ తెలిపారు.

ఈ ఘటనలో మూడు తులాల బంగారం, ఒక లక్ష్మీ బిల్లల చైన్, మరో చైన్ దుండగులు లాక్కెళ్లినట్లు ఆమె వాపోయారు.నేను ఒంటరి మహిళను. నా బంగారు ఆభరణాలను అపహరించిన వారిని త్వరగా గుర్తించి, నా వస్తువులను నాకు తిరిగి అందించాలని పోలీసులను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.

నాకు పోలీసులు అండగా నిలిచి న్యాయం చేయాలి” అని రత్నమ్మ విజ్ఞప్తి చేశారు.పత్తికొండ నుంచే తనను ఎవరో వెంబడిస్తున్నట్లు అనిపించిందని, అయితే ఆ సమయంలో విషయాన్ని గుర్తించలేకపోయానని ఆమె తెలిపారు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.రెండు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేస్తామని సీఐ వేణుగోపాల్ తెలిపారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story