Markapur: మార్కాపురంలో శాకంబరి అలంకారంలో ముద్దసానమ్మ దర్శనం

Markapur: మార్కాపురంలో ఆషాఢ మాసం నాల్గవ ఆదివారం ముద్దసానమ్మ అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 9 Aug 2026 1:05 PM IST
Markapur
X

Markapur: మార్కాపురంలో శాకంబరి అలంకారంలో ముద్దసానమ్మ దర్శనం

మార్కాపురంలో: శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన ముద్దసానమ్మ అమ్మవారు

ఆలయ ప్రహరీ గోడ, గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణానికి భక్తుల సహకారం కోరుతున్న ఆలయ కమిటీ

మార్కాపురంలో ఆషాఢ మాసం నాలుగవ ఆదివారం సందర్భంగా ముద్దసానమ్మ అమ్మవారిని శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా అమ్మవారి ఆలయం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, గిరి ప్రదక్షిణ మార్గం నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది.

పవిత్రమైన ఈ నిర్మాణ కార్యక్రమానికి భక్తులు తమవంతు సహాయ సహకారాలు అందించి ఆలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అమ్మవారి సేవలో భక్తుల సహకారం, ఆలయ అభివృద్ధికి వారి తోడ్పాటు ఎంతో అవసరమని తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story