Giddalur: పీఆర్ కాలనీ కోర్టు కాంప్లెక్స్ ఎదుట లాయర్ల ఆందోళన!
Giddalur: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు కాంప్లెక్స్ ఎదుట న్యాయవాదులు ధర్నా నిర్వహించారు.
Giddalur: పీఆర్ కాలనీ కోర్టు కాంప్లెక్స్ ఎదుట లాయర్ల ఆందోళన!
గిద్దలూరు: కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని గిద్దలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పిఆర్ కాలనీ లో గల కోర్ట్ కాంప్లెక్స్ బయట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు పిఎన్ శేష శయనా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి కర్నూలు లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ కు మద్దతుగా బుధ, గురు వారాలలో గిద్దలూరులో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయకుంటే తమ నిరసనను ఇంకా ఉదృతం చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏ. తిరుమల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బి. ఐజాక్, ఉప కార్యదర్శి సిహెచ్ పోలయ్య, ట్రెజరర్ షేక్ ఫాజిల్, సీనియర్, జూనియర్ మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు.




