Markapur: గంగుమాల శోభన్ బాబు నియామకంపై పెద్దదోర్నాలలో హర్షం!
Markapur: వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా గంగుమాల శోభన్ బాబు నియామకం. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల శ్రేణులు, కుటుంబ సభ్యుల హర్షం.
Markapur: గంగుమాల శోభన్ బాబు నియామకంపై పెద్దదోర్నాలలో హర్షం!
Markapur: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గంగుమాల శోభన్ బాబును నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గంగుమాల కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీశైలం–పెద్దదోర్నాల మండలాల మాల మహానాడు అధ్యక్షుడు మరియు తైక్వాండో మాస్టర్ గంగుమాల విజయ్ బాబు మాట్లాడుతూ.. గంగుమాల శోభన్ బాబుకు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
శోభన్ బాబుపై నమ్మకంతో పార్టీ రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శోభన్ బాబు కృషి చేస్తారని, దళితులు, వెనుకబడిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ దృష్టికి తీసుకెళ్లి వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడతారని విజయ్ బాబు ఆకాంక్షించారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు అండగా నిలుస్తూ, వారికి తగిన న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా గంగుమాల శోభన్ బాబు నియామకం పట్ల పెద్దదోర్నాల మండల పరిధిలోని దళిత నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
శోభన్ బాబును అభినందిస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎస్సీ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు కోరారు.




