Atmakur: మీసం మెలేసి పోటీ చేస్తాం.. అడ్డుకుంటే అంతు చూస్తాం
Atmakur: ఆత్మకూరులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసిస్తూ వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
Atmakur: మీసం మెలేసి పోటీ చేస్తాం.. అడ్డుకుంటే అంతు చూస్తాం
Atmakur: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు మీసం మెలేసి పోటీ చేస్తారాని అడ్డుకుంటే.. అంత చూస్తామంటూ శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి టిడిపి నాయకులకు శ్రేణులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రెండేళ్ల ప్రభుత్వానికి నిరసనగా శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరులో ఆ పార్టీ శ్రేణులు భారీ నిరసన ర్యాలీలు నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం పేరుతో ఒంటరిగా గెలవలేక చంద్రబాబు నాయుడు మూడు కాళ్ల కుంపటిలో దిగి గెలిచాడని మాజీ ఎమ్మెల్యే శిల్ప ఎద్దేవా చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. శ్రీశైలం నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే, అనుచరులు అడ్డుకుని అక్రమ కేసులు బనాయించేందుకు చూస్తున్నారని మా అభ్యర్థులు మీసం మెలేసి ఎవరికి భయపడకుండా నామినేషన్లు వేస్తారు అడ్డుకుంటే వేలాది కార్యకర్తల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తారని మాజీ ఎమ్మెల్యే శిల్ప హెచ్చరించారు.
ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన పథకాలు సూపర్ సిక్స్ కాదని.. పాపర్ సిక్స్ లని శిల్ప ఎద్దేవా చేశారు. వర్ధన్ బ్యాంకును దోచుకున్నానని నన్ను జైలుకు పంపిస్తానాన్నవు మీ వెన్నుపోటు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నన్ను జైలుకు ఎందుకు పంపలేకపోయావు అంటూ శ్రీశైలం ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే శిల్ప ప్రశ్నించారు.
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మెగా డీఎస్సీ ఉద్యోగాలను దగాడిఎస్సి గా మార్చి కోట్ల రూపాయలు దండుకుంటే .. శ్రీశైలం నియోజకవర్గంలో తెదేపా నాయకుల దోపిడీ మితిమీరిపోతుందని చివరకు శ్రీశైల జగద్గురు పీఠాధిపతిని కూడా వదలలేదని శిల్ప ధ్వజమెత్తారు. ఆత్మకూరులో ఆర్యవైశ్యులను చితక బాద డమే ఆర్య వైశ్యుల సంక్షేమమా అని ఆయన ప్రశ్నించారు. నా హయాంలో శ్రీశైలం నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటో చూపిస్తా .. ఎప్పుడు వస్తావు.. ఎక్కడికి వస్తావు.. నువ్వే వస్తావా? లేక నన్నే రమ్మంటావా అని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి కి బహిరంగ సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే శిల్ప.
2024 ఎన్నికల్లో తెదేపా మేనిఫెస్టో, సూపర్ పథకాల ప్రజలను దగ్ధం చేసి సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.




