Kalwakurthy: కల్వకుర్తిలో నకిలీ యూరియా కలకలం.. 24.5 క్వింటాళ్లు సీజ్
Kalwakurthy: కల్వకుర్తి మండలం లింగసానిపల్లిలో 24.5 క్వింటాళ్ల నకిలీ యూరియాను పోలీసులు సీజ్ చేశారు. కోరమండల్ బ్రాండ్ పేరిట అక్రమ విక్రయాలపై కేసు నమోదు.
Kalwakurthy: కల్వకుర్తిలో నకిలీ యూరియా కలకలం.. 24.5 క్వింటాళ్లు సీజ్
కల్వకుర్తి: నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన అశోక్ రెడ్డి అక్రమంగా కోరమండల్ పేరుతో నకిలీ యూరియాను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో కల్వకుర్తి వ్యవసాయ అధికారి సురేష్ తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో అక్రమ నిల్వలు గుర్తించడంతో కల్వకుర్తి డీఎస్పీకి ఫిర్యాదు చేయడం తో, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అశోక్ రెడ్డి వద్ద ఉన్న 24.5 క్వింటాళ్ల కోరమండల్ పేరుతో ఉన్న నకిలీ యూరియాను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్టు పోలీస్ లు తెలిపారు..
ఈ సందర్భంగా డీఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, డూప్లికేట్ ఎరువులు వాడడం వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, రైతులు అధికారిక ఎరువుల దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలని, అనుమానస్పద ఎరువులు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ భీమ్ కుమార్ ఎస్సై కురుమూర్తి పోలీసులు తదితరులు పాల్గొన్నారు.




