Atmakur: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు!
Atmakur: నంద్యాల జిల్లా ఆత్మకూరులో వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
Atmakur: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు!
ఆత్మకూరు: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరులో వైఎస్ఆర్సిపి తలపెట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతి లేదని ముందుకు వెళితే అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు నిరసనకారులను తీవ్రంగా హెచ్చరించారు. దీంతో ఆగ్రహించిన వైఎస్ఆర్సిపి శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు కర్నూలు - గుంటూరు రాష్ట్ర రహదారిపై బైఠాయించారు.
దగా డిఎస్సీతో యువత జీవితాలతో పేకాట జూదం ఆడిన విద్యాశాఖ మంత్రి దగా చేసి అనర్హులకు ఉద్యోగాలు అమ్ముకోవడం దేశ చరిత్రలోనే లేదని మాజీ ఎమ్మెల్యే శిల్ప విమర్శించారు. కూటమి ప్రభుత్వానిది ధర్మ పాలన అని చెప్పుకునే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధర్మంగా దగా డీఎస్సీకి పాల్పడ్డాడని.. జరిగిన అవకతవకలపై సిబిఐచే విచారణ జరిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే శిల్ప డిమాండ్ చేశారు. అలాగే లోకేష్ తన పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసు బలగాలు ముందస్తుగానే నంద్యాల టర్నింగ్ వద్దకు చేరుకుని ప్రారంభమైన నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో.. మాజీ ఎమ్మెల్యే శిల్ప.. నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్ డౌన్.. మంత్రి నారా లోకేష్ రాజీనామా .. సిబిఐతో విచారణ, ర్యాలీని అడ్డుకున్న పోలీసులు డౌన్.. డౌన్.. అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు ఆత్మకూరులో మారుమ్రోగాయి.
రెండు మూడు రోజుల్లో.. వెలుగోడు రిజర్వాయర్ నుంచి వరి సాగుకు నీటిని విడుదల చేయకపోతే.. రైతులతో కలిసి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అల్టిమేట్ జారీచేసారు.
శ్రీశైలం జలాశయానికి 180 టీఎంసీల నీరు చేరినా తాగునీటి అవసరాల సాకుతో పోతిరెడ్డిపాడు ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసి రైతులను మోసగించాడంటూ చంద్రబాబును తీవ్రంగా విమర్శిస్తూ వెలుగోడు రిజర్వాయర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేసే కార్యక్రమానికి రైతులు భారీ సంఖ్యలో తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా పిలుపునిచ్చారు.




