Kurnool: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపాలి కంగాటి శ్రీదేవి

Kurnool: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 27 July 2026 11:41 PM IST
Kurnool
X

Kurnool: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపాలి కంగాటి శ్రీదేవి

కర్నూలు: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాల పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బాధ్యుల పై కేసులు నమోదు చేసి శిక్షలు వేయాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా తరహాలో మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్ చేశారు.

ఈ నెల 28న వైసీపీ విద్యార్థి యువత ఆధ్వర్యంలో నిర్వహించే ర్యాలీకి సంబంధించిన పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి విడుదల చేశారు.

డీఎస్సీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాస్తే ఆ ఎగ్జామ్ లో కూడా అవకతవాలు జరిగాయని, విద్యార్థుల తల్లిదండ్రుల కలలను విచ్చిన్నం చేశారని ఈ విషయాన్ని బయటకు రాకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని దీనిపై మాట్లాడని వారిపై కేసులు నమోదు చేశారని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేనిపక్షణ ఉద్యమానికి సిద్ధం అవుతామని మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story