Kurnool: కర్నూలులో ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్ డే వేడుకలు.. SPIRIT Appపై అవగాహన.

V RAMAMOHAN, KURNOOL
Published on: 15 Sept 2026 1:51 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు!

Kurnool: బి.క్యాంప్‌లోని ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ప్రముఖ ఇంజనీర్, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డా. ఎస్. నాగస్వామి నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు భారతదేశ ఆధునిక ఇంజనీరింగ్ అభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడని తెలిపారు. ఆయన ప్రతిభ, క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం మరియు దేశసేవ నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

విశ్వేశ్వరయ్య గారు ఇంజనీరింగ్ రంగంతో పాటు నీటి పారుదల, ఆనకట్టల నిర్మాణం, వ్యవసాయ అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి మరియు దేశ ఆర్థికాభివృద్ధికి విశేష సేవలు అందించారని వివరించారు. ముఖ్యంగా కృష్ణరాజ సాగర్ ఆనకట్ట వంటి ప్రాజెక్టుల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.

SPIRIT App పై విద్యార్థులకు అవగాహన

అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కమిషనర్ డా. రంజిత్ బాషా గారి చొరవతో రూపొందించిన SPIRIT App గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ను డిసెంబర్ 2027 నాటికి పూర్తిగా అక్షరాస్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించినట్లు విద్యార్థులు వివరించారు.

SPIRIT అనేది Students at the Core, Progress with Technology, Inclusive and Equitable, Real-Time Monitoring, Impact for a Better Society, Towards a Fully Literate AP అనే లక్ష్యాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ఈ యాప్ ద్వారా అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనే అభ్యాసకుల వివరాలను ట్రాక్ చేయడం, వారి పురోగతిని పర్యవేక్షించడం, వెనుకబడిన అభ్యాసకులను గుర్తించడం వంటి అంశాలను సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించవచ్చని విద్యార్థులు వివరించారు. “Every Learner Counts” అనే భావనతో ప్రతి అభ్యాసకుడికి అక్షరాస్యత అందించడమే SPIRIT App ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

కమిషనర్ డా. రంజిత్ బాషా గారి మార్గదర్శకత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా సాంకేతికతను వినియోగించుకుని అక్షరాస్యత కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి జరుగుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. మారుతున్న సాంకేతిక ప్రపంచంలో వృత్తి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందని, విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, కృష్ణమోహన్, సోమేశ్, సారధి పటేల్, చిన్న మల్లేష్, ఉల్గోజి రావు, సాయి శ్రావణి, శ్రీధర్ మూర్తి, ఇంతియాజ్ తదితరులు పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొని ఇంజనీర్స్ డే ప్రాధాన్యతతో పాటు SPIRIT App మరియు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యంపై అవగాహన పొందారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL