Kurnool: మృతుడు రంగస్వామి కుటుంబానికి రూ. 1.20 కోట్ల బీమా చెక్ అందజేత!

Kurnool: ఓర్వకల్లు మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ రంగస్వామి కుటుంబానికి రూ. 1.20 కోట్ల యూనియన్ బ్యాంక్ బీమా చెక్‌ను అందజేసిన కర్నూలు కలెక్టర్.

V RAMAMOHAN, KURNOOL
Published on: 4 Sept 2026 11:17 AM IST
Kurnool
X

Kurnool: మృతుడు రంగస్వామి కుటుంబానికి రూ. 1.20 కోట్ల బీమా చెక్ అందజేత!

Kurnool: కర్నూలు ఓర్వకల్లు మండలం కన్నమడకల గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఏ.ఏం. రంగస్వామి ఏప్రిల్ 1వ తేదీన ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నేపథ్యంలో తన జీతభత్యాలను యూనియన్ బ్యాంక్ ద్వారా పొందుతూ ఉన్నందున యూనియన్ బ్యాంక్ వారి ద్వారా వారి కుటుంబ సభ్యులకు కోటి 20 లక్షల రూపాయల బీమా చెక్ ను ఆయన తల్లి లక్ష్మమ్మ, భార్య పుష్ప లత లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి గురువారం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ద్వారా జీతాలు పొందుతున్న శాశ్వత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే కోటి 20 లక్షల రూపాయలు అందజేస్తుందని తెలిపారు. బీమా పథకాల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ డి. అనిల్ కుమార్, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎదుభూషణ్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ డి. హుసేన్ వలి, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story