Kurnool: ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ పనులను గడువులోగా పూర్తి చేయాలి

Kurnool: పరిశ్రమల మంత్రిత్వ శాఖ (DPIIT) సెక్రటరీ అమర్‌దీప్ సింగ్ భాటియా ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 18 July 2026 7:15 PM IST
Kurnool
X

Kurnool: ఓర్వకల్లు కొప్పర్తి ఇండస్ట్రియల్ పనులను గడువులోగా పూర్తి చేయాలి

కర్నూలు: ఓర్వకల్లు నోడ్, కొప్పర్తి నోడ్ లలో జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సెక్రటరీ అమర్‌దీప్ సింగ్ భాటియా IAS, ఏజెన్సీ లు, అధికారులను ఆదేశించారు.

శనివారం గుట్టపాడు సమీపంలో అభివృద్ధి చెందుతున్న నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NICDC) ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం ఓర్వకల్లు నోడ్, కొప్పర్తి నోడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏజెన్సీలు, అధికారులతో కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సెక్రటరీ అమర్‌దీప్ సింగ్ భాటియా, IAS, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, IAS లు సమీక్ష నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NICDC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) & మేనేజింగ్ డైరెక్టర్ (MD) రజత్ కుమార్ సైనీ IAS, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) మేనేజింగ్ డైరెక్టర్ (MD) దినేష్ కుమార్ IAS, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) ఈడి యశ్వంత్ కుమార్ రెడ్డి, IAS, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) చీఫ్ ఇంజనీర్ లు హరిధర్, మణి భాస్కర్ లు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తొలుత కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సెక్రటరీ తొలుత నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NICDC) లో భాగంగా మొదటి దశలో 2, 621 ఎకరాలలో జరుగుతున్న రహదారులు, తాగునీటి నెట్‌వర్క్,

డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సంబంధిత, తదితర అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అనంతరం NICDC కార్యాలయం వర్క్ సైట్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ లో ఏజెన్సీ, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా తొలుత ఓర్వకల్లు నోడ్, కొప్పర్తి నోడ్ లో ఉన్న , రాబోయే పరిశ్రమల పనుల గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, i పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సెక్రెటరీ కు వివరించారు.. ఈ ప్రాజెక్ట్ లలో కాంపొనెంట్ వారీగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి పనుల పురోగతి గురించి వివరించారు.

అనంతరం కేంద్ర వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) సెక్రటరీ మాట్లాడుతూ కొప్పర్తి నోడ్ లలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సంబంధిత ఏజెన్సీ లతో ఆరా తీశారు. ఓర్వకల్లు నోడ్, కొప్పర్తి నోడ్ లో ఏర్పాటు చేస్తున్న రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి డిజైన్లు, నిర్మాణాలు, నాణ్యత, తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి కావాలని నాణ్యత లోపం లేకుండా పనులు జరగాలని ఆదేశించారు.

అనంతరం ఓర్వకల్లు నోడ్ లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం అయ్యారు.. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తదితర అంశాలపై వారితో చర్చించారు.

సమావేశంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి, సందీప్, సంబంధిత ఏజెన్సీ ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story