Dhone: డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

Dhone: డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో సొంత ఖర్చులతో మదర్ ఫీడింగ్ రూమ్ ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్త మైకేల్. ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి.

Bharat Raj, Dhone
Published on: 5 Aug 2026 4:58 PM IST
Dhone
X

Dhone: డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో మదర్ ఫీడింగ్ రూమ్ ప్రారంభం

డోన్: డోన్ ఆర్టీసీ బస్టాండ్‌లో చిన్నారులకు తల్లిపాలు అందించే తల్లుల కోసం ప్రత్యేక మదర్ ఫీడింగ్ రూమ్‌ను జనసేన పార్టీ కార్యకర్త మైకేల్ తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు.

ఈ గదిని స్థానిక ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మైకేల్ మాట్లాడుతూ, ఒకసారి బహిరంగ ప్రదేశంలో ఓ తల్లి చిన్నారికి పాలిస్తున్న సమయంలో ఆమె పడిన ఇబ్బందిని చూసి మనసు కలచివేసిందన్నారు.

అలాంటి పరిస్థితి మరే తల్లికి ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఈ గదిని నిర్మించినట్లు తెలిపారు. ప్రయాణికులైన తల్లులకు ఈ సౌకర్యం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభినందించారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story