Markapuram: దాహం తీర్చుకోబోయి.. వీధి కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు వద్ద దాహం తీర్చుకోవడానికి వచ్చిన చుక్కల దుప్పిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 13 Jun 2026 8:11 PM IST
Markapuram
X

Markapuram: దాహం తీర్చుకోబోయి.. వీధి కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి!

Markapuram: మార్కాపురం జిల్లా రాచర్ల మండలంలోని పెద్దచెరువు సమీపంలో చుక్కల దుప్పిని వీధి కుక్కలు దాడి చేసి చంపాయి. నీటిని తాగేందుకు వచ్చిన క్రమంలో జింకపై కుక్కలు దాడి చేసి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకని పరిశీలించి పోస్టుమార్టం అనంతరం దహన కార్యక్రమాలు పూర్తి చేశారు. నల్లమల్ల అటవీ ప్రాంతం అతి సమీపంలో ఉండడం వల్లే దాహం తీర్చుకోవడానికి చుక్కలదొప్పి ఈ ప్రాంతంలోకి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story