Nandyal: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఎం నిరసన

Nandyal: నంద్యాల జిల్లా బేతంచెర్లలో గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ధర్నా చేపట్టింది.

Bharat Raj, Dhone
Published on: 3 May 2026 3:15 PM IST
Nandyal
X

Nandyal: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీపీఎం నిరసన

Nandyal: నంద్యాల జిల్లా డోన్ బేతంచెర్ల సర్కిల్ లో గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ధరలు పెంచబోమని హామీ ఇచ్చి, ఇప్పుడు గ్యాస్ ధరలను భారీగా పెంచడం పేద ప్రజలపై, చిన్న వ్యాపారులపై భారమైందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్ మాట్లాడుతూ, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవన వ్యయం పెరిగిందని, ప్రభుత్వ విధానాలు ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story