Kurnool: కర్నూలులో 'నో అదానీ స్మార్ట్ మీటర్' సీపీఎం ఇంటింటి ప్రచారం!
Kurnool: కర్నూలు శ్రీరామ్‌నగర్‌లో సీపీఎం 'ఇంటింటికీ సీపీఎం' ప్రచారం చేపట్టింది. కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, అదానీ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
Kurnool: కర్నూలులో 'నో అదానీ స్మార్ట్ మీటర్' సీపీఎం ఇంటింటి ప్రచారం!
Kurnool: ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా 23వ వార్డు శ్రీరామ నగర్ లో ప్రచార కార్యక్రమం జరిగింది ఇంటింటికి తిరుగుతూ మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దు కరెంటు చార్జీలు తగ్గించాలని కోరుతూ సిపిఎం పార్టీ స్టిక్కర్లను ఇంటింటికి వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ అజ్మత్ అధ్యక్షత వహించారు ప్రజలు స్మార్ట్ మీటరు పెట్టకూడదని కరెంటు చార్జీలు తగ్గించాలని మోయలేని కరెంటు భారాలను తగ్గించాలని ప్రజలు కూటమి ప్రభుత్వంపైతీవ్రవ్యతిరేకతవెలిబుచ్చారుఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు సిపిఎం పార్టీ వార్డు కార్యదర్శి కె.వి జనార్దన్ రావు ప్రజలను వారు పడుతున్నకరెంటుఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రజలు సిపిఎం నాయకులకు తమ బాధలను వివరిస్తూ కరెంటు మేము వాడిన యూనిట్ల కంటేఅదనంగాచార్జీలువేస్తున్నారని ఈ చార్జీలు ఎందుకు వేస్తున్నారనికరెంటువారినిఅడిగితే పాత బకాయిలు వసూలు చేస్తున్నామని చెబుతున్నారు కరెంటు బిల్లులు తీయడానికి వచ్చిన వారిని మాకెందుకు ఇంత కరెంట్ బిల్లు వస్తుందంటే మీరు కరెంటు ఆఫీస్ కు వెళ్లి అధికారులను కలవండి మాకేం తెలియదు అని సమాధానం ఇస్తున్నారు ఆఫీసులకు వెళితే గవర్నమెంట్ వసూలుచేయమని చెప్పింది ప్రభుత్వము ఎలక్ట్రికల్ డిస్కమ్ లకు బకాయిలు పడినందువలన ఈబకాయిలను ప్రజల మీద సర్ చార్జెస్ యూజర్ చార్జెస్ పేరుతో చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు.
ఎవరో వాడిన దానికి ప్రభుత్వం పడిన బకాయికి మాకు ఏమి సంబంధం మేము ఎన్ని యూనిట్లు వాడితే అన్ని యూనిట్లకు మేము డబ్బులు చెల్లించాలి కదా ఆ విధంగా కాకుండా కరెంటు డబల్ చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీనగర కార్యదర్శి సభ్యులు ఆర్ నరసింహులు వార్డు శాఖ కార్యదర్శి కే వి జనార్దన్ రావు గారు మాట్లాడుతూ గతంలో వైయస్సార్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సర్ చార్జీలు యూజర్ చార్జీల పేరుతో 30 వేల కోట్ల రూపాయలు కరెంటు బారాలు ప్రజల పైన వేసింది వైయస్సార్ ప్రభుత్వం ప్రజల పైన కరెంటు బారాలు వేసింది మేము అధికారంలోకి వస్తే కరెంటు భారాలు వెయ్యము కరెంటు చార్జీలు పెంచము తగ్గిస్తాము అని చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లువేయించుకొన్నతెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినవెంటనేరెండుసంవత్సరాలకాలంలోనే28వేలకోట్లరూపాయలు సర్ చార్జీలు యూజర్ చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారంవేసింది.
రెండు ప్రభుత్వాలు ప్రజలను వంచించి మోసం చేశాయి అన్నారు కార్పొరేటు ఆదాని కంపెనీ ఇచ్చే కమీషన్లకుకక్కుర్తివడిప్రభుత్వాలు ప్రజల పైన కరెంటు భారాలు వేయడానికి సిద్ధమవడం చాలా అన్యాయం అన్నారు ఇప్పుడే పెరిగిన కరెంటు చార్జీలు డబల్ బిల్లులతో ప్రజలు సతమత మవుతుంటే మూల్గే నక్కపై తాటికాయ పడిన చందంగా పాత మీటర్లను తొలగించి అదాని స్మార్ట్ మీటర్లను ప్రజలు ఇళ్ల దగ్గర లేని సమయము చూసి ఆదానీ మనసులతో ఇళ్ల బయట ఉన్నటువంటి పాత మీటర్లను తొలగించి అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం చాలా దుర్మార్గం అన్నారు.
మీ మీటరు సరిగా తిరగడం లేదని ట్రబుల్ ఉందని మాయమాటలు చెప్పి పాత మీటర్ను తొలగించి కొత్త మీటర్లు మోసపూరితంగా పెడుతున్నారు ఈ మీటర్లు పెడితే ఒక రోజులోనే మూడు రకాల యూనిట్ చార్జీలు మారే అవకాశం ఉన్నది ఈ మీటర్ ఖరీదు త్రీఫేస్ లైన్ లో9వేల రూపాయలు ఫైవ్ ఫేస్ లైన్లో 19వేల రూపాయలు వినియోగ దారుడే భరించవలసి ఉంటుంది అన్నారు. ఈ మీటరుకు ముందుగానే డబ్బులు కట్టి రీఛార్జి చేసుకోవలసిన పరిస్థితి ఉంటుంది పాత మీటర్ కైతే నెల రోజులు కరెంటు వాడి ఆతర్వాత కరెంట్ బిల్లు చెల్లించాలిఅప్పుడు కూడా చెల్లించ లేకపోతే రెండో నెల చివరి వరకు ఫైన్తోకట్టుకొనే అవకాశం ఉంటుంది వినియోగ దారుడికి స్మార్ట్ మీటర్ పెట్టడం వలన ఎప్పుడుకరెంటుపోతుందో ఎప్పుడు రీఛార్జ్ సమయం ముగుస్తుందో తెలియక ఇంట్లో కరెంటు లేకుండా చీకట్లో ఉండవ లసిన పరిస్థితి ఏర్పడుతుంది.
వేలాది రూపాయలు కరెంటు మీటరు భారం కూడాపడుతుంది అదాని ప్రైవేట్ మీటర్స్ ను మా ఇంటికిపెట్టవద్దు అని ప్రజలు వ్యతిరేకించాలనికోరారు.ఇప్పటికే వాణిజ్య సముదాయాలు ప్రజలుఇండ్లదగ్గరలేనిసమయంలో దొడ్డిదారిలో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని మానుకోవాలని లేకపోతే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలుచెబుతారనిహెచ్చరించారు లేదు కూడదు అదాని మీటర్లు తప్పకుండా పెట్టిస్తామని మొండి వైఖరితో అమలు చేయాలని చూస్తేప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు తెలియజేశారు.
ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ వార్డు నాయకులు జి వెంకటేశ్వర్లు విజయ్ సిపిఎం పార్టీ నగర నాయకులు సి శేషాద్రి , మొదలగు వారు పాల్గొన్నారు.




