Kurnool: అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ పాదయాత్ర చేయాలి!
Kurnool: ఎమ్మిగనూరులో జరిగిన సీపీఐ జనరల్ బాడీ సమావేశంలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ రాష్ట్ర నాయకుడు కే. రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు.
Kurnool: అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ పాదయాత్ర చేయాలి!
కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీపీఐ జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు... ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర నాయకుడు రామకృష్ణ పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అధికారంలో ఉండి ఏమీ చేయలేక తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఓ వైపు సీఎం చంద్రబాబు కేబినెట్ లో మాట్లాడడం,ఎమ్మెల్యే లు మంత్రలుతో ఊరూరా మాట్లాడించడం చేస్తే, మరోవైపు పవన్ కళ్యాణ్ పాప పరిహార యాత్ర చేసారని గుర్తుచేశారు..
ఇప్పటికీ లడ్డూ కల్తీ పై ఏమీ తేల్చలేకపోయారన రామకృష్ణ విమర్శించారు.ఇక అయోధ్య రామ మందిరంలో వందల కోట్ల అవినీతి ఆరోపణల పై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ రామకృష్ణ ప్రశ్నించారు.
తిరుపతి అంశంపై స్పందించినట్టే అయోధ్య విషయంపైనా స్పందించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా అమరావతి నుంచి అయోధ్య వరకు పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయాలని డిమాండ్ చేశారు.




