Devanakonda: దేవనకొండలో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ తహశీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 24 Aug 2026 4:31 PM IST
Devanakonda
X

Devanakonda: దేవనకొండలో సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా!

దేవనకొండ: తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి వలసలు నివారించాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని, నూతనంగా తీసుకుని వచ్చిన వి బి జి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు సి. కృష్ణ లు డిమాండ్ చేశారు.

సోమవారం. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికేఎంయు) ఆధ్వర్యంలో దేవనకొండ మండల తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగినది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు నష్టం కలిగించే విధానాలను కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కాదన్నారు. ఈ దేశంలో సంపన్న వర్గాలకే దేశ సంపదను దోచిపెట్టడంలో భాగంగానే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు.

వి బి జి రాంజీ నూతన పథకాన్ని తక్షణమే రద్దుచేసి, ఉపాధి కూలీలకు కనీస వేతనం 600 రూపాయలు, 200 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతికటించకుండా కేంద్రం చెప్పినట్టు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడం సరైన పద్ధతి కాదన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు భాస్కర్, రామంజి, తిమోతి, దుబ్బన్న, నాగేంద్ర, కృష్ణ, శ్రీనివాసులు, రామాంజనేయులు, రఫీ, అనుమప్ప, మద్దిలేటి, మహాదేవ, మహేష్, హనుమంతు, రాము, రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story