Markapuram: ప్రజల ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం.. విజయ సునీత
Markapuram: జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతన పీజీఆర్‌ఎస్ (PGRS) భవన నిర్మాణానికి కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.
Markapuram: ప్రజల ఫిర్యాదుల త్వరితగతిన పరిష్కారమే లక్ష్యం.. విజయ సునీత
మార్కాపురం: ప్రజలకు మరింత మెరుగైన ఫిర్యాదుల పరిష్కార సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించనున్న పీజీఆర్‌ఎస్ (Public Grievance Redressal System) భవనానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ క్లస్టర్ ఇన్‌చార్జ్ కందుల రామిరెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి ఏలూరి రామచంద్రారెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఎలక్ట్రికల్ ఈఈ నాగేశ్వరావు, చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి, కూటమి నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఫిర్యాదులను వేగవంతంగా స్వీకరించి, పారదర్శకంగా పరిష్కరించే విధంగా పీజీఆర్‌ఎస్ భవనం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రజలకు ఒకేచోట మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోందన్నారు.
ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ఈ భవనం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.




