Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో అందుబాటులో జాబితాలు!

Markapuram: వెలిగొండ ప్రాజెక్టు పెండింగ్ నిర్వాసితుల పరిష్కారానికి కలెక్టర్ ఎం. విజయ సునీత చర్యలు. కలెక్టరేట్‌లో అందుబాటులో ఆర్ అండ్ ఆర్, ఓటీఎస్ జాబితాలు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 22 Aug 2026 2:11 PM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం కలెక్టరేట్‌లో అందుబాటులో జాబితాలు!

Markapuram: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని పెండింగ్‌ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్‌ ఎం. విజయ సునీత ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

పెండింగ్‌ నిర్వాసితుల జాబితాలను మార్కాపురం కలెక్టరేట్‌లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. గొట్టిపడియ గ్రామానికి సంబంధించిన రెండు పెండింగ్‌ జాబితాలు, అక్కచెరువు గ్రామ పెండింగ్‌ జాబితాతో పాటు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, ఓటీఎస్‌ జాబితాలను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదేశంలో ఉంచారు.

జాబితాల్లో పేర్లు ఉన్న నిర్వాసితులు తమ అర్హతకు సంబంధించిన ఆధార పత్రాలను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో అధికారులకు సమర్పించాలని కలెక్టర్‌ విజయ సునీత సూచించారు. నిర్వాసితులు సమర్పించిన పత్రాలను అధికారులు పరిశీలించి అర్హతను నిర్ధారించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

పెండింగ్‌ నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా జాబితాలను రూపొందించి, ప్రతి ఒక్కరి వివరాలను పారదర్శకంగా అందుబాటులో ఉంచడంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కలెక్టర్‌ విజయ సునీతకు కృతజ్ఞతలు తెలిపారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story