Markapuram: ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలు ప్రారంభం కలెక్టర్ సునీత!
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహన సేవలను కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు.
Markapuram: ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలు ప్రారంభం కలెక్టర్ సునీత!
Markapuram: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహన సేవలను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తల్లులు, నవజాత శిశువులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందేలా ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ సేవలు ఉపయోగపడతాయని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అనంతరం తల్లులు, శిశువులు సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు ఈ వాహన సేవలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తల్లి–బిడ్డ ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




