Markapuram: మార్కాపురం మార్కెట్ యార్డులో ఘనంగా థిమాటిక్ యోగా వేడుకలు!

Markapuram: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో థిమాటిక్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 14 Jun 2026 11:43 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురం మార్కెట్ యార్డులో ఘనంగా థిమాటిక్ యోగా వేడుకలు!

మార్కాపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డులో థిమాటిక్ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, డిఎస్పి నాగరాజు, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, టిడిపి నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వక్కలగడ్డ మల్లికార్జున, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు పివీ .కృష్ణారావు మరియు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా సాధకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

యోగా ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు ఆకట్టుకోగా, యోగా ప్రాముఖ్యతపై నిపుణులు వివరించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్ విజయ సునీత ,ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అభినందించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story