Markapuram: ఓటర్ల నమోదు పరిశీలన.. ఇళ్లకు వెళ్లిన కలెక్టర్!
Markapuram: మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డు, పూల సుబ్బయ్య కాలనీ ప్రాంతాల్లో సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టర్
Markapuram: : ఓటర్ల నమోదు పరిశీలన.. ఇళ్లకు వెళ్లిన కలెక్టర్!
మార్కాపురం, జూన్ 28: భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ డే సందర్భంగా మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులోని నీళ్ల ట్యాంక్ ఏరియా, పూల సుబ్బయ్య కాలనీ ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ చేపడుతున్న ఎన్యూమరేటర్ల పనితీరును కలెక్టర్ పరిశీలించి, ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రతి అర్హుడైన ఓటరు పేరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




