Kurnool: జూన్ 24న కర్నూలుకు సీఎం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలన!
Kurnool: ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
Kurnool: జూన్ 24న కర్నూలుకు సీఎం.. జొన్నగిరి గోల్డ్ మైన్స్ పరిశీలన!
కర్నూలు: ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని, పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరి లో జీయో మైసూర్ గోల్డ్ మైన్స్ కంపెనీ పరిశీలన నిమిత్తం వస్తున్నారని ఈ పర్యటనకు కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి జిల్లా అధికారులను ఆదేశించారు
సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24న పత్తికొండ నియోజకవర్గం జొన్నగిరిలోని జియో మైసూర్ గోల్డ్ మైన్స్ కంపెనీ పరిశీలన చేస్తారని కావున ముఖ్యమంత్రి స్థాయి పర్యటనకు తగిన ఏర్పాట్లు ఎటువంటి పొరపాట్లు లేకుండా చేయాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు.
జొన్నగిరిలో హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పటి నుండి పబ్లిక్ మీటింగ్ ముగించుకుని తిరిగి విజయవాడ బయలుదేరేంతవరకు ముఖ్యమంత్రి కి అవసరమైన అన్ని సౌకర్యాలు కలుగజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కొరకు ఆరు స్టాల్స్ ఏర్పాటు చేసి అందులో వివరాలు ఉండేలాగా పొరపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అడ్వాన్స్ లైఫ్ సపోర్టింగ్ సిస్టంలు మూడు ప్రదేశాలలో అంబులెన్స్ లతో ఉండాలని, లైవ్ బ్లడ్ డోనర్, కార్డియో, న్యూరో స్పెషలిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.
పి జి ఆర్ ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని ఎంప్లాయిమెంట్ అధికారిణి ని ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులను రోడ్లు, బారికేడింగ్, హెలిపాడ్, బహిరంగ సభ స్థలం పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్కో అధికారులను నిరంతర కరెంటు సరఫరా చర్యలు, త్రాగునీరు, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎస్ ఈ ఆర్డబ్ల్యూఎస్ మనోహర్ ను ఆదేశించారు.
ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, ఆర్ అండ్ బి ఎస్ ఈ మహేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో వెంకటరమణారెడ్డి, జి జి హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ కామేశ్వర ప్రసాద్, డాక్టర్ భాస్కర్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ జఫరుల్లా, డ్వామా పిడి నరసింహరెడ్డి డిఇఓ నాగరాజు, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ దీప్తి,
ఆర్డీవో పత్తికొండ చిన్న ఓబులేసు,డిటిసి శాంతకుమారి, ఐసిడిఎస్ పిడి విజయ, ఎస్ జి ఎస్ డబ్ల్యూ అధికారి భాస్కర్ నాయుడు, ఏడి హార్టికల్చర్ రాజ కృష్ణ రెడ్డి, ఈడి సోషల్ వెల్ఫేర్ తులసిదేవి, డిఆర్డిఏ పిడి రమణారెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి అశోక్ కుమార్, ఏపీఎంఐపి పిడి సుధాకర్, సి పి ఓ భారతి, దేవాదాయ శాఖ ఏసి సుధాకర్ రెడ్డి, డిడి మైన్స్ నాగిణి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డి పి ఓ భాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, మొదలగు అధికారులు పాల్గొన్నారు.




