Kurnool: కర్నూలులో చంద్రశేఖర్ ఆజాద్, తిలక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి, బాల గంగాధర్ తిలక్ జయంతి. మహనీయుల త్యాగాలను స్మరించుకున్న ప్రిన్సిపాల్.
Kurnool: కర్నూలులో చంద్రశేఖర్ ఆజాద్, తిలక్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ!
Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో భారత స్వాతంత్ర్య సమరంలో చెరగని ముద్ర వేసిన మహా విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతితో పాటు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ గారు చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ఈ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, చంద్రశేఖర్ ఆజాద్ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహోన్నత దేశభక్తుడని పేర్కొన్నారు. బ్రిటీష్ పాలనకు ఎదురొడ్డి నిర్భయంగా పోరాడిన ఆయన త్యాగం, ధైర్యం, దేశభక్తి నేటి యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశం కోసం జీవించిన మహనీయుల ఆశయాలను విద్యార్థులు ఆచరణలో పెట్టి ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
అదేవిధంగా లోకమాన్య బాల గంగాధర్ తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని కలిగించిన గొప్ప నాయకుడని తెలిపారు. "స్వరాజ్యం నా జన్మహక్కు, దానిని సాధించి తీరుతాను" అనే ఆయన నినాదం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త ఊపునిచ్చిందని పేర్కొన్నారు. విద్య, దేశభక్తి, స్వాభిమానం, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు విద్యతో పాటు దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను అలవర్చుకోవాలని, అప్పుడే సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతులను నిర్వహించడం ద్వారా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర, జాతీయ నాయకుల సేవలపై విద్యార్థులకు అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, రామకృష్ణ, సోమేశ్, ప్రసన్న కుమార్, కృష్ణమోహన్, సారధి పటేల్, శ్రీధర్ మూర్తి, చిన్న మల్లేష్, ఉల్గోజి రావు, బాలశంకర్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్ జీవిత విశేషాలను వివరిస్తూ వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఘన నివాళులర్పించారు.




