Kurnool: కర్నూలులో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు!
Kurnool: కర్నూలు నగరంలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా పూడికతీత పనులను ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు.
Kurnool: కర్నూలులో ముమ్మరంగా డ్రైనేజీ పూడికతీత పనులు!
కర్నూలు: నగరంలో పూడికతీత పనులు ముమ్మరంగా చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. సోమవారం కిడ్స్ వరల్డ్ సర్కిల్, వడ్డేగిరి, బంగారుపేట, గాంధీనగర్, ఆనంద్ టాకీస్ జంక్షన్, సీతారాంనగర్, రామలింగేశ్వర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షం ఎప్పుడు కురిసినా డ్రైనేజీ వ్యవస్థలో వర్షపు నీరు సజావుగా ప్రవహించేలా అవసరమైన పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు. రూ.2.39 కోట్ల వ్యయంతో 134.28 కిలోమీటర్ల మేర ప్రత్యేక పూడికతీత పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
అందులో ప్రధాన కాలువల్లో పూడికతీతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అదే విధంగా కె.సి. కెనాల్‌లో రూ.10 లక్షల వ్యయంతో 3.5 కిలోమీటర్ల మేర స్వచ్ఛత పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి రోజూ మధ్యాహ్నం అంతర్గత డ్రైనేజీ కాలువల్లో పూడికతీత పనులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు నగరపాలక యంత్రాంగం చేస్తున్న శ్రమను, పూడిక పేరుకుపోవడం వల్ల కలిగే అనర్థాలను గ్రహించి డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం వేయొద్దని కోరారు. మున్సిపల్ సిబ్బందికే వ్యర్థాలను అందించాలని, ఒకవేళ సిబ్బంది రాకపోతే 18004259766 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కమిషనర్ సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు అనిల్, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.




