Srisailam: శ్రీశైలంలో 'ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం' కార్యక్రమం!
Srisailam: శ్రీశైలంలో 'ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం' వినూత్న కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు శ్రీకారం చుట్టారు.
Srisailam: శ్రీశైలంలో 'ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం' కార్యక్రమం!
Srisailam: శ్రీశైలంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చైర్మన్ పోతుకుంట రమేష్ నాయుడు
ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం అనే కార్యక్రమం నిర్వహణ
క్షేత్ర పరిధిలో స్థానికులను కలిసి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుంటున్న చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు
శ్రీశైలంలో చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ప్రత్యేక కార్యక్రమనికి చేపట్టారు ప్రజల వద్దకే సమస్యల పరిష్కారం అనే కార్యక్రమం పెట్టి క్షేత్రపరిధిలో స్వయంగా వెళ్లి అక్కడి స్థానికులను కలిసి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు దేవస్థానంలోని సంబంధిత విబాగాల అధికారులతో కలిసి స్థానిక సిద్ధరామప్ప వాణిజ్య సముదాయంలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు.
ఇందులో వారు ఎదురుకుంటున్న సమస్యలను చైర్మన్ కు తెలిపారు వెంటనే స్పందించిన చైర్మన్ అక్కడిక్కడే అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు సిద్ధిరామప్ప కాంప్లెక్స్ లో పారిశుద్ధ్య నిర్వహణ,భద్రతా,వాణిజ్య సముదాయం చుట్టూ ప్రహరితరహాలో చైన్‌లింక్ మెష్,మురుగునీటి పారుదల మొదలైన అంశాలను చైర్మన్ కు చెప్పడంతో అధికారులతో మాట్లాడుతూ సమస్యల పరిష్కరానికి ఎటువంటి జాప్యం చేయకుండా త్వరగతిన చేయాలని తెలిపారు.




