Nandyal: డోన్‌లో కలకలం 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు!

Nandyal: నంద్యాల జిల్లా డోన్‌లో అనుమతి లేకుండా నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభించిన జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మరికొందరిపై పోలీసుల కేసు నమోదు.

Bharat Raj, Dhone
Published on: 24 Aug 2026 9:48 AM IST
Nandyal
X

Nandyal: డోన్‌లో కలకలం 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదు!

Nandyal: నంద్యాల జిల్లా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 14 మంది వైఎస్సార్సీపీ నాయకులపై కేసు నమోదైంది. నిన్న డోన్‌లో నూతన ఎంపీడీవో కార్యాలయాన్ని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ప్రారంభించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యాలయాన్ని ప్రారంభించారని ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎంపీడీవో ఫిర్యాదు మేరకు జడ్పీ చైర్మన్ పాపిరెడ్డితో పాటు మరో 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. Cr. No.121/2026గా కేసు నమోదు చేసి BNS సెక్షన్లు 189(2), 329(4), 331(1), 324(3), 61(2) r/w 190తో పాటు PDPP Act సెక్షన్ 3 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Bharat Raj, Dhone

Bharat Raj, Dhone

Next Story