Yemmiganur: తప్పుడు కథనాలకు భయపడను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల హెచ్చరిక!
Yemmiganur: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధిని చూసి ఓర్వలేకే తప్పుడు కథనాలు. సదరు పత్రికపై పరువు నష్టం దావా వేస్తానని టీడీపీ నేత భాస్కర్ల స్పష్టం.
Yemmiganur: తప్పుడు కథనాలకు భయపడను టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల హెచ్చరిక!
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కథనాలతో బురదజల్లే విష పుత్రిక చప్పుళ్లకు తాను భయపడనని, నిజాయితీగా అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొంటామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
ఈ సందర్బంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో అయన మాట్లాడుతు దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అనాటి నుండి ఈనాటి వరకు నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తున్నారని నిస్వార్థంగా పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. దీనిని సహించలేని వైసిపి నాయకులు, పత్రిక తప్పుడు కథనాలతో విభేదాలు సృష్టించే కుట్రలు చేసినా ఎవరిని విడదీయలేరన్నారు.
టీడీపీ సైన్యం ఎల్లప్పుడు పచ్చజెండా కిందనే ఉంటుందని, ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి నీడలో అండగా వెన్నంటి ఉంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవ, సంక్షేమ అభివృద్ధి అమలు లక్ష్యంతో పని చేయాలన్న రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సూచనలతో పనిచేస్తున్నామని తెలిపారు.
కానీ ఆ పత్రిక మాత్రం నాపై తప్పుడు కథనాలు రాయటం, పార్టీ సైనికులను కించపరిచేలా భాష వాడటం సహించనని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని, అలాగే రెండున్నర సంవత్సరాల కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంతో పాటు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అంతే కాకుండా వారికి నోటీసు పంపి పరువు నష్టదావ వేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.




