Banaganapalle: బనగానపల్లెలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహణ
Banaganapalle: నంద్యాల జిల్లా బనగానపల్లెలో భగీరథ మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. ఎస్సై దుగ్గిరెడ్డి నివాళులర్పించారు.
Banaganapalle
Banaganapalle: నంద్యాల జిల్లాలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న భగీరథ మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బనగానపల్లె ఎస్సై దుగ్గిరెడ్డి పాల్గొని మహర్షికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంగను భూమికి తెచ్చిన మహర్షిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం ఉప్పర సంఘం నాయకుడు భూషన్న మాట్లాడుతూ భగీరథ మహర్షి సేవలను గుర్తుంచుకోవడం సమాజానికి అవసరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో బనగానపల్లెలో కూడా ఈ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని ఉప్పర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించగా, సంఘం సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




