Banaganapalle: 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.300 కోట్లు

Banaganapalle: 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆర్ అండ్ బీ రోడ్ల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఆదేశాలతో రూ.300 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.

Ramanaiah, Banaganepalle
Published on: 9 Sept 2026 6:23 PM IST
Banaganapalle
X

Banaganapalle: 2027 గోదావరి పుష్కరాలకు ఆర్ అండ్ బీ రోడ్లకు రూ.300 కోట్లు

బనగానపల్లె: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టనున్న గోదావరి పుష్కరాలు – 2027కు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు అత్యుత్తమ, సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్ & బీ రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ. 300 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రాష్ట్ర రోడ్లు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.

6 జిల్లాల్లో 431 కి.మీ మేర రహదారుల పునర్నిర్మాణం, రోడ్ల ఆధునీకరణ

గోదావరి తీర, పరిసర ప్రాంతాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, పోలవరం, ఏలూరు జిల్లాల్లో రహదారుల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలోని 78 రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మంజూరైన రూ. 300 కోట్ల నిధులతో ఈ 6 జిల్లాల వ్యాప్తంగా దాదాపు 431 కిలోమీటర్ల పొడవైన స్టేట్ హైవేలు (SH), జిల్లా ప్రధాన రహదారులను (MDR) అభివృద్ధి చేయనున్నారు.

స్టేట్ హైవేల (SH) పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల పనుల కోసం రూ. 185.75 కోట్ల నిధులు కేటాయించారు. జిల్లా ప్రధాన రహదారులకు (MDR) లకు సంబంధించి 155 కిలోమీటర్ల మేర గల 37 కీలక రహదారుల అభివృద్ధి కోసం రూ. 114.25 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు.

గోదావరి పుష్కరాల వంటి ఆధ్యాత్మిక వేడుకకు దేశ వ్యాప్తంగా భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి ట్రాఫిక్, ప్రయాణ ఇబ్బందులు కలగకుండా, ఈ రూ. 300 కోట్ల నిధులతో గోదావరి తీర ప్రాంత రహదారుల రూపురేఖలను పూర్తిగా మారిపోతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Ramanaiah, Banaganepalle

Ramanaiah, Banaganepalle

Next Story