Kurnool: బక్రీద్ నేపథ్యంలో కర్నూలులో ఆకస్మిక తనిఖీలు.. ఎస్పీ విక్రాంత్ పాటిల్
Kurnool: బక్రీద్ పండుగ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు. మూగజీవాల అక్రమ రవాణాపై ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేక నిఘా.
Kurnool: బక్రీద్ నేపథ్యంలో కర్నూలులో ఆకస్మిక తనిఖీలు.. ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు : జిల్లా సరిహద్దు ప్రాంతాలు, చెక్‌పోస్టులు, ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, అనుమానాస్పద వాహనాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.
మే 28 వ తేదిన బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి మూగజీవాలను అక్రమ రవాణా, చట్టవిరుద్ధ వధింపులు జరగకుండా జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు మంగళవారం తెలిపారు.
ఈ సంధర్బంగా కర్నూలు నగరంలోని ఉల్చాల రోడ్డు వై జంక్షన్ వద్ద కర్నూలు డిఎస్పీ శ్రీ జె. బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమసింహా, కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.
కర్నూలు డిఎస్పీ గారు మాట్లాడుతూ..
మే 28న బక్రీద్ పండుగ సంధర్బంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో ఆకస్మికంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎపిఎస్పీ 2 వ బెటాలియన్, ఎఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. అసాంఘిక కార్యకలపాల పై లాడ్జీలలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అందరూ ఐక్యమత్యంగా ఉంటూ శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలన్నారు.
ఎటువంటి పుకార్లను, వదంతులను నమ్మవద్దన్నారు. అక్రమ రవాణా చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు , కేసులు నమోదు చేసి , అరెస్టు వంటి చర్యలు కూడా అమలు చేస్తామన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే పోలీసులను సంప్రందించాలన్నారు. అనుమానాస్పద రవాణా లేదా అక్రమ కార్యకలాపాలపై వెంటనే డయల్ 112 కు గాని లేదా డయల్ 100 కు గాని లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు.




