Atmakur: సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపట్టిన శిబిరాన్ని కూల్చివేసిన పోలీసులు

Atmakur: నీట్ పరీక్షను రద్దు చేయాలంటూ ఆత్మకూరులో డాక్టర్ నాగన్న దీక్ష. అనుమతి లేదంటూ టెంట్లను తొలగించిన పోలీసులు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర విమర్శలు.

M Satya Peter, Atmakur (Karnool)
Published on: 16 July 2026 5:22 PM IST
Atmakur
X

Atmakur: సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా నిరాహార దీక్షలు చేపట్టిన శిబిరాన్ని కూల్చివేసిన పోలీసులు

ఆత్మకూరు: భారతదేశంలో గత 16 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న " నీట్ పరీక్ష.. ఓ పెద్ద..చీటింగ్ " అంటూ బిజెపి ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన ఎన్డీఏ కూటమి పై నిప్పులు చెరిగారు ప్రముఖ వైద్యులు, సత్య శోధక్ సమాజ్, బామ్ సేఫ్, సామాజిక రాయలసీమ ప్రతినిధి డాక్టర్ నాగన్న. గత 25 రోజుల నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లింక్ సందర్భంగా ఆ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ నీట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ భారతదేశంలో ప్రముఖ ఇంజనీర్, పర్యావరణ మేధావి, అంతర్జాతీయ స్థాయి ప్రముఖ శాస్త్రవేత్త సోనం వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు.

ఈ అంశానికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం పాలనా కేంద్రం ఆత్మకూరులో డాక్టర్ నాగన్న నిరాహార దీక్షలు చేపట్టారు. నిరసన దీక్షలకు శిబిరంలో ఉండగా అనుమతులు లేవంటూ ఆత్మకూరు పోలీసు ఉన్నతాధికారులు హల్చల్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు పోలీస్ అధికారులు. శాంతియుతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరాహార దీక్ష చేస్తే.. తప్పేంటని నిరసనకారులు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసు అధికారులు దీక్షా శిబిరం టెంట్లను కూల్చి వేశారు. చేతనైతే ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేసుకోండి అంటూ వెటకారంగా మాట్లాడారు. పోలీసుల అత్యుత్సాహంతో నిరాహార దీక్షలు నిలిచిపోయాయి.

ఈ సందర్భంగా డాక్టర్ నాగన్న మీడియాతో మాట్లాడారు. నిన్నటి నీట్ పరీక్ష లో దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయడం ..పేపర్ లీక్ కావటం వల్ల దేశంలో పదిమందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని సిబిఎస్ మూల్యాంకనాలలో కూడా భారీ అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. పోయిన విద్యార్థుల ప్రాణాలను ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి తీసుకు రాగలదా అని ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో 70 రకాల పరీక్ష పేపర్ల లీకులు జరిగాయన్నారు. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న డిమాండ్ కు మద్దతుగా తాము నిరాహార దీక్ష చేపడితే పోలీసులు భగ్నం చేయడం ఆ ప్రజాస్వాణికం, దుర్మార్గమని ఆయన విమర్శించారు.

నీట్ ఇస్ ఎ బిగ్ ఛీట్ .. అంటూ ఈ నీట్ ప్రవేశ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్వపు ఎంసెట్ విధానాన్ని రాష్ట్రాలవారీగా తిరిగి ప్రవేశపెట్టాలన్నారు.ఒకే దేశం .. ఒకే భాష .. ఓకే ఓటు .. ఓకే నీట్ అమలు చేస్తున్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒకే కులాన్ని కూడా అమలు చేయాలని ఎన్డీఏ కూటమిని డాక్టర్ నాగన్న డిమాండ్ చేశారు. దీనివల్ల దేశంలో సామాజిక అసమానతలు, మతపరమైన సమస్యలు ఉండవని సూచించారు.

దేశంలో కోట్లాదిమంది ప్రజలు తమ సమస్యలపై గొంతు విప్పి ప్రశ్నిస్తే.. దేశద్రోహం, రాజా ద్రోహం కేసులు నమోదు చేయడం చూస్తుంటే.. ఈ దేశంలో " అప్రకటిత అత్యవసర పరిస్థితి " అమలు చేస్తున్నారేమో అని ఈ దేశ పౌరులు భయాందోళనలు చెందుతున్నారన్నారు.ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్ చుక్ డిమాండ్లను కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం ఒప్పుకొని ఆయన ప్రాణాలను కాపాల్సిన బాధ్యత కేంద్రంలో బిజెపి అనుసంధాన ఎన్ డి ఏ కూటమిదేనని అన్నారు. ఈ దేశంలోని ప్రతి పౌరులు, మేధావులు, బహుజనులు బయటకు వచ్చి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల మేరకు ప్రజల్లో అవగాహన, ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావాలని డాక్టర్ నాగన్న పిలుపునిచ్చారు.

M Satya Peter, Atmakur (Karnool)

M Satya Peter, Atmakur (Karnool)

Next Story