Markapuram: 10వ తరగతిలో రికార్డు ఫలితాలు అర్ధవీడు హెచ్‌ఎమ్ సుజాతను సత్కరించిన కలెక్టర్!
Markapuram: పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి అవార్డు సాధించిన అర్ధవీడు జడ్పీ హెచ్‌ఎమ్ సుజాత దంపతులను సత్కరించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత.
Markapuram: 10వ తరగతిలో రికార్డు ఫలితాలు అర్ధవీడు హెచ్‌ఎమ్ సుజాతను సత్కరించిన కలెక్టర్!
Markapuram: 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రంలోని 10 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసి, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవార్డులు అందజేసింది.
ఇందులో భాగంగా మార్కాపురం జిల్లా అర్ధవీడు మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు బెస్ట్ యావరేజ్ ఫలితాల విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు దక్కింది.
పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విశేష కృషి చేసిన అంధురాలైన ప్రధానోపాధ్యాయిని సుజాత దంపతులను జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో వారిని సత్కరించి, వారి కృషిని ప్రశంసించారు.
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రధానోపాధ్యాయిని సుజాత చేస్తున్న సేవలు అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించి, ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.




