Kurnool: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్!
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF) ఆధ్వర్యంలో జర్నలిస్టుల నిరసన.
Kurnool: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్!
కర్నూలు: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని APWJF గౌరవ అధ్యక్షులు, గిప్సన్, దేవేంద్ర మూర్తి, అధ్యక్షులు షబ్బీర్ లు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసిల్దార్ కార్యాలయం ముందు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల డిమాండ్స్ డే ను పురస్కరించుకొని నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం డిప్యూటీ తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు .ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు వారు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలన్నారు. మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ పింఛన్ ఇవ్వాలన్నారు .
జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి కార్మిక భీమాను వర్తింపజేయాలన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ సంక్షేమ నిధి ఏర్పాటు, జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ, జర్నలిస్టులపై దాడుల నివారణకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.మీడియా అకాడమిక్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ గౌరవ అధ్యక్షులు దేవేంద్ర మూర్తి, సెక్రెటరీ నాగరాజు, శంకర్, సోహెల్, లక్కీ ఖలీల్, వెంకటేష్, సునీల్, రెహమాన్, రాజు, విజయ్, సురేంద్ర, రమేష్, పార్టు, లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.




