Markapuram: కొత్త కమిటీ.. కొత్త ఆశలు.. మార్కాపురం హౌసింగ్ కార్పొరేషన్ జేఏసీ ఎన్నిక
Markapuram: మార్కాపురం జిల్లాలో ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల జేఏసీ నూతన కమిటీ ఎన్నిక.
Markapuram: కొత్త కమిటీ.. కొత్త ఆశలు.. మార్కాపురం హౌసింగ్ కార్పొరేషన్ జేఏసీ ఎన్నిక
Markapuram: నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ (ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్) ఉద్యోగస్తుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నూతన జిల్లా కమిటీని ఘనంగా ఎన్నుకున్నారు. తేదీ 26-04-2026న ఎలక్షన్ ఆఫీసర్ శ్రీ కర్ణ వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్మన్ అందే పవన్ కుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సంస్థాభివృద్ధి కోసం నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
ఎన్నికైన నూతన జిల్లా కమిటీ సభ్యులు ఈ విధంగా ఉన్నారు:
ప్రెసిడెంట్: కోలగట్ల ఆంజనేయ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్: సంద్రపాటి రజిని కుమార్ ,జనరల్ సెక్రటరీ: ఆర్. శివ నరేష్ ,జాయింట్ సెక్రటరీ: మునగా శ్రీనివాసులు,ట్రెజరర్: గుంటక వెంకట రెడ్డి ఈసీ సభ్యులు:గంగవరపు శ్రావ్య, కె. రంజిత్ కుమార్, ఎన్. వెంకటేశ్వర రెడ్డి, సిద్ధ సాయి చందు, మొతాటి మహేశ్వర్ రెడ్డి, జే. అశోక్, చెరుకుపల్లి శివ ప్రకాష్ .ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు, పరస్పర సహకారంతో సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.ఉద్యోగులందరి ఆశయాలను నెరవేర్చేందుకు సమిష్టిగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.




