Alur: ఆలూరు నియోజకవర్గంలో పండుగలా క్లస్టర్ల మహానాడు
Alur: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ క్లస్టర్ల మహానాడు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం.
Alur: ఆలూరు నియోజకవర్గంలో పండుగలా క్లస్టర్ల మహానాడు
ఆలూరు: నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లస్టర్ల మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిడిపి ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పార్టీ జెండాను ఎగరవేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహానాడు సభలో చేసిన ప్రసంగాన్ని వైకుంఠం జ్యోతి, టిడిపి రాష్ట్ర నాయకుడు వైకుంఠం శివప్రసాద్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. నియోజకవర్గంలోని ప్రతి క్లస్టర్, మండల పరిధిలో మహానాడు కార్యక్రమాల నిర్వహణను ఆలూరు టిడిపి పరిశీలకులు తలారి ఆది నారాయణ, వైకుంఠం జ్యోతి పరిశీలించారు.
పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం హలహర్విలో టిడిపి కార్యకర్తలతో కలిసి నాయకులు భోజనం చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మహానాడు కార్యక్రమం సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది.




