Alur: ఆలూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

Alur: కర్నూలు జిల్లా ఆలూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవం. జెండా ఆవిష్కరించిన సీఐ రవి శంకర్ రెడ్డి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జర్నలిస్టులు.

Bheemalinga, Aluru
Published on: 17 Aug 2026 4:57 PM IST
Alur
X

Alur: ఆలూరులో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరుఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాలూకా అధ్యక్షులు సూరి ఆధ్వర్యంలో సోమవారం ఆలూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద యూనియన్ జెండాను ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి ,ఎస్ ఐ లు మన్మధ విజయ్,ఈశ్వర్ రావు లో ఆవిష్కరించారు.

అనంతరం ఏపీయూడబ్ల్యూజే నాయకులు, జర్నలిస్టులతో కలసి వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం ఏపీయూడబ్ల్యూజే 69 ఏళ్లుగా చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.

జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కృషి

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని సీఐ రవి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులు వృత్తి విలువలను కాపాడుకుంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు.

ఏపీయూడబ్ల్యూజే 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జర్నలిస్టుల ఐక్యతకు, సంఘం సాధించిన ప్రగతికి నిదర్శనమని యూనియన్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘటితంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

ఘనంగా సంబరాలు

ఈ కార్యక్రమంలో వార్త బ్రాంచ్ మేనేజర్ గుడిసె శివన్న, సిపిఐ,సి పి ఎం నాయకులు భూపేష్,భాష,హనుమంతు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు సుంకన్న,స్వరూప్,చంద్రమోహన్,నాయకులు యశోద కుమార్,డేనియల్,భీమా,సోమన్న,బద్రి,గోపాల్,వీరేష్,నారాయణ,,హనునేష్, చిన్న ,రంగస్వామి,రాజేష్ కన్నా,ఛత్రపతి, ఎర్రిస్వామి పాల్గొన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story