Allagadda: ఆళ్లగడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి కన్నుమూత
Allagadda: ఆళ్లగడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామలింగారెడ్డి వయోభారంతో శనివారం కన్నుమూశారు.
Allagadda: ఆళ్లగడ్డ మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి కన్నుమూత
ఆళ్లగడ్డ: మాజీ మున్సిపల్ చైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామలింగారెడ్డి మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది. ఆయన పార్థివ దేహానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి నివాళులర్పించారు.
ఆళ్లగడ్డ పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సంవత్సరాలుగా వైద్యసేవలు అందించిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ రామలింగారెడ్డి శనివారం వయోభారంతో కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసి కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వైద్యుడిగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, ప్రజాప్రతినిధిగా కూడా డాక్టర్ రామలింగారెడ్డి విశేష సేవలందించారు. ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రతి కౌన్సిల్ సమావేశంలో అధికారులకు విలువైన సూచనలు అందించారు. పట్టణ అభివృద్ధికి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఆళ్లగడ్డ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు.
ఒకవైపు మున్సిపల్ చైర్మన్గా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు వైద్యుడిగా తన చివరి శ్వాస వరకు ప్రజలకు సేవలందించడం ఆయన సేవాభావానికి నిదర్శనంగా నిలిచింది.
డాక్టర్ రామలింగారెడ్డి మరణవార్త తెలుసుకున్న రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆయన స్వగృహానికి చేరుకుని పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, “డాక్టర్ రామలింగారెడ్డి ఆళ్లగడ్డ పట్టణానికి ఒక రోల్ మోడల్. వైద్యసేవలు, ప్రజాసేవల ద్వారా ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి” అని అన్నారు.
ఆళ్లగడ్డ సీనియర్ న్యాయవాది, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి, ఏవీ యూత్ నాయకులు కృష్ణమోహన్, హుస్సేన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అలాగే నంద్యాల కమ్యూనికేషన్స్ (సిటీ కేబుల్) సిబ్బంది పాల్గొన్నారు. వైద్యుడిగా, ప్రజాసేవకుడిగా డాక్టర్ రామలింగారెడ్డి అందించిన సేవలు ఆళ్లగడ్డ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని స్థానికులు నివాళులర్పిస్తున్నారు.




