Kurnool: భగత్ సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి.. ఏఐవైఎఫ్

Kurnool: దేవనకొండలో ఏఐవైఎఫ్ 67వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీపీఐ నేతలు జాతీయ యువజన విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 May 2026 7:37 PM IST
Kurnool
X

Kurnool: భగత్ సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి.. ఏఐవైఎఫ్

Kurnool: దేవనకొండ సమగ్రమైన జాతీయ యువజన విధానాన్ని ప్రవేశపెట్టాలని సిపిఐ మండల కార్యదర్శి ఎమ్. నరసరావు డిమాండ్ చేశారు. ఆదివారం దేవనకొండలో అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) 67 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక సిపిఐ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు ఎం మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎమ్.రామాంజనేయులు పతాకావిష్కరణ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశానికి స్వాతంత్ర ఉద్యమం అందించిన స్ఫూర్తిని ముందు తీసుకెళ్తూ, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువతను ఐక్యం చేయాలనే లక్ష్యంతో ఏఐవైఎఫ్ పనిచేస్తుందన్నారు. ఏఐవైఎఫ్ స్థాపించిన రోజు నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా యువజన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం,

దేశంలో 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు ఇవ్వాలని, విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రజా ఆరోగ్య రంగంలో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ ఉద్యమిస్తుందని వారన్నారు. మోడీ ప్రభుత్వం ఎన్నికలలో సంవత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేశారని వారు అన్నారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికలలో నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు, భృతి ఇవ్వకుండా మోసం చేశారని వారన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (BNEGA) ద్వారా దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయాలని, నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్ దశల వారి పోరాటం చేస్తుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి కె. భాస్కర్, ఏఐవైఎఫ్ నాయకులు మధు, రఫీ, హరికృష్ణ, రంగస్వామి, రంగడు, కోదండ, మద్దిలేటి, వీరస్వామి,వీరేష్,శేఖర్, రఫీ,దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story