Pattikonda: పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి: ఏఐటీయూసీ డిమాండ్!
Pattikonda: కార్మికులకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పంచాయతీ ఈవోకు వినతిపత్రం ఇచ్చారు.
Pattikonda: పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి: ఏఐటీయూసీ డిమాండ్!
పత్తికొండ: పత్తికొండ గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మిక సంఘం ఏఐటీయూసీ (అనుబధం) ఆద్వర్యంలో పత్తికొండ గ్రామ పంచాయతీ ఈవో గారికి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
పత్తికొండ గ్రామ పంచాయతీ లో ప్రజల ఆరోగ్యం కోసం, ఊరి పరిశుభ్రత కోసం పగలు, రాత్రి శ్రమిస్తున్నారు. గ్రామపంచాయతీ లో చాలా సంవత్సరాల నుండి ఎలక్ట్రిషన్ , వాటర్ మెన్, పారిశుద్ధ్య కార్మికులుగా పని చేయుచున్నారు. కార్మికులు చాలిచాలని వేతనాలతో నిత్యవసర ధరలు భారీగా పెరిగడం వల్ల కుటుంబాలు గడవక, పోషించుకోలేక ఆకలితో అలమటిస్తు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డిమాండ్స్...
గ్రామపంచాయతీలో పంచాయతీ కార్మికులకు నెలకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26వేల రూపాయలు ఇవ్వాలి. పంచాయతీ కార్మికుల వేతనాలు ఒకే విడతలో చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీ లోపు జీతాలు అందేలా శాశ్వత జీవో తీసుకురావాలి. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి ఉచిత భీమ సౌకరం కల్పించాలి.
కార్మికులకు నెలకు మూడు సెలవులు ఇవ్వాలి. గ్రామపంచాయతీలో పని చేసే కార్మికులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు నిర్మించుకోవడానికి పక్క గృహాలను మంజూరు చేయాలి.ఈ డిమాండ్లను గ్రామపంచాయతీ పై అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పత్తికొండ గ్రామపంచాయతీ ఈవో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎన్ కృష్ణయ్య, సిపిఐ మండల కార్యదర్శి యు కారుమంచి ఏఐటీయూసీ తాలూకా అధ్యక్ష , కార్యదర్శులు జి.నెట్టికంఠయ్య హెచ్.రంగన్న ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు బి.మాదన్న ఏఐటీయూసీ గ్రామపంచాయతీ కార్మికులు , వచ్చురప్ప నాగేష్ రామాంజిని,అంజి , నరసింహ, పెద్ద వీరన్న రామచంద్ర రంగస్వామి బాలకృష్ణ, నాగవేణి రంగమ్మ తదితరులు పాల్గొన్నారు అభినందనలతో హెచ్ రంగన్న ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి.




