Devanakonda: రైతులకు కీలక సూచనలు: ఖరీఫ్ పంటల నమోదు తప్పనిసరి!

Devanakonda: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో వ్యవసాయ శాఖ, కేవీకే శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

G Jagadeesh, Pathikonda
Published on: 3 Aug 2026 7:57 PM IST
Devanakonda
X

Devanakonda: రైతులకు కీలక సూచనలు: ఖరీఫ్ పంటల నమోదు తప్పనిసరి!

దేవనకొండ: ఖరీఫ్ లో రైతులు ఏ పంట వేసి ఉంటే ఆ పంట నమోదు చేయవలెను అలాగే రైతులు మీ రైతు సేవ సిబ్బందికి సహకరించి మీ పంట పొలంలో వేసిన పంటను నమోదు చేయించుకోవాలని కోరుచున్నాము

కె వి కె సైంటిస్టులు విజయలక్ష్మి , నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎలినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు స్వల్పకాలిక పంటలు సద్ద జొన్నలు మినుములు రాగులు, కొర్రలు వేసుకోవాలని చూసిస్తున్నాము అలాగే ప్రకృతి వ్యవసాయం పద్ధతులు పాటించవలసిందిగా కోరుచున్నాను

AO ఉషారాణి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులు వర్షపాతం తక్కువ ఉన్నందువలన పెట్టను తట్టుకునే మందులు యూరియా రెండు గ్రాముల లీటర్ నీటిలో కలుపుకొని లేదా 19.19.19 రెండు గ్రాముల నీటిలో కలుపుకొని స్ప్రే చేయవలసిందిగా మీ పంటను కొంతమేరకు కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది

రైతులు మీరు మీ పొలంలో వేసిన పంటను నమోదు చేయించుకోవాలని మీకు తెలియజేస్తుంది ఆర్ఎస్కే సిబ్బంది ప్రతి పొలం సందర్శించి పంట నమోదు చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో ఏడిఏ మోహన్ విజయకుమార్ మండల వ్యవసాయ అధికారిని ఉషారాణి H.O లక్ష్మీ ప్రసన్న వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్లు అనిలా, AEO రంగన్న, మల్లికార్జున ,అబ్దుల్ సలాం మరియు ఆర్ఎస్కే సిబ్బంది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది రంగస్వామి ,మురళి పాల్గొనడం జరిగినది.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story