Kurnool: కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ పరిశీలన!
Kurnool: కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్‌ను అడిషనల్ ఎస్పీలు పరిశీలించి, జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Kurnool: కర్నూలులో స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్ రిహార్సల్స్ పరిశీలన!
Kurnool: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ ను పరిశీలించిన.....
అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా,
ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్.
రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సంధర్బంగా కట్టుదిట్టమైన గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ లు తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ శుక్రవారం ఉదయం నిర్వహించారు.
కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ రిహార్సల్స్ కు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ హుస్సేన్ పీరా, ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారులు హాజరై పరిశీలించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ...
స్వాతంత్ర్య వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్న సంధర్బంగా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు నిఘా ను పటిష్టం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డు డిఎస్పీ ప్రసాద్, ఆర్ ఐలు , ఆర్ ఎస్సైలు, సివిల్ , ఏ ఆర్, పోలీసు, హోంగార్డ్సు , ఎన్ సి సి విద్యార్థులు , స్కౌట్ విద్యార్దులు పాల్గొన్నారు.




