Alur: ఆలూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ: యువకుడు మృతి!

Alur: కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగస్కల్ బస్టాండ్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని మనేకుర్తికి చెందిన బోయ అశోక్(26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

Bheemalinga, Aluru
Published on: 1 Sept 2026 11:16 PM IST
Alur
X

Alur: ఆలూరు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీ: యువకుడు మృతి!

ఆలూరు: కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధిలోని అంగస్కల్ గ్రామ బస్టాండ్ నందు మంగళవారం రాత్రి ద్విచక్ర వాహన దారుని గుర్తు తెలియని వాహనం ఢీ కొని అక్కడకక్కడే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

బంధువులు తెలిపిన వివరాల మేరకు మనేకుర్తి గ్రామానికి చెందిన బోయ మంగమ్మ,వీరేష్ దంపతుల కుమారుడు అశోక్(26)తన బంధువుల పెళ్ళి కార్యానికి అరికేర గ్రామానికి వెళ్లి తిరిగి సొంత గ్రామానికి మనేకుర్తి కి తిరిగి వస్తుండగా వెనుక నుండి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిన్నట్లు తెలిపారు.

మృతుడికి నాలుగేళ్ళ క్రిందట పెళ్ళి అయింది.భార్య సంగీత ఉంది. సిఐ రవి శంకర్ రెడ్డి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన శవాని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టన్ కొరకు తరలించి దర్యాప్తు చెప్పటిన్నారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru

Next Story