Nandigama: నిరుద్యోగులతో కలసి రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్!

Nandigama: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగులతో భారీ నిరసన ర్యాలీ.

Naresh, Nandigama
Published on: 10 Aug 2026 12:06 PM IST
Nandigama
X

Nandigama: నిరుద్యోగులతో కలసి రోడ్డెక్కిన మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్!

Nandigama: నందిగామ పట్టణంలో వైసీపీ నిరసన ర్యాలీ డీఎస్సీ లో జరిగిన అవకతవలపై సీబీఐ విచారణ కోరుతూ విద్యార్థులు నిరుద్యోగ యువతతో కలిసి మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ర్యాలీ నిర్వహించారు.

కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైకాపా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు...డీఎస్సీ అభ్యర్థుల్ని ఘోరంగా మోసం చేసింది కూటమి ప్రభుత్వం అని విమర్శించారు .

కేవలం స్పోర్ట్స్ కోటను అడ్డం పెట్టుకొని అర్హత పరీక్షను అక్కరలేదని చెప్పి మరలా రిక్రూట్ చేసిన తర్వాత సర్టిఫికెట్లు ఇచ్చింది కూడా తెలుగుదేశం నాయకులు అని విమర్శించారు.అర్హత లేని వారందరికీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చి నిర్దాక్షణంగా మోసం చేశారని విమర్శించారు.

ఇది చాలదన్నట్టు కూటమి ప్రభుత్వానికి సిగ్గు లేకుండా ఉద్యోగాలు వచ్చిన వారితో ర్యాలీ చేయించడం తగదన్నారు నిరుద్యోగ యువత కోసం వైకాపా మద్దతు తెలిపితే వైకాపా పై దాడులు చేస్తున్నారని అన్నారు.40% ఓటింగ్ ఉండి బాధ్యతాయుతంగా పోరాటం చేసే హక్కు వైకాపాకు ఉందని తెలిపారు .

కళ్ళ ముందు ఇన్ని దారుణాలు జరుగుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాం.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది కూటమి ప్రభుత్వం అని ప్రశ్నించారు.

వాలంటరీ వ్యవస్థను తొలగించారని ఫీజ్ రింబిస్మెంటు ఇవ్వలేదని అన్నారు.డీఎస్సీ పై సీబీఐ విచారణ జరిగేంతవరకు మరియు నిరుద్యోగ భృతి ఇచ్చేంతవరకు ఈ పోరాట ఆగదని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు.

Naresh, Nandigama

Naresh, Nandigama

Next Story