Nandigama: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అరుణ్ ఫైర్!
Nandigama: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వరుస కేసుల నమోదుపై ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nandigama: కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ అరుణ్ ఫైర్!
నందిగామ: నందిగామలో 2022వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు పై జరిగిన ఘటనపై 2024 లో కేసు నమోదు చేయడంపై ఎమ్మెల్సీ మొండితోక అరుణకుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడారు.2022లో చంద్రబాబు నాయుడుకు చెట్టు కొమ్మ తగిలి గాయమైతే రాళ్లు వేశారని చెప్పి 18 మందిపై కేసు నమోదు చేశారని తెలిపారు.
ఈ రెండు ఏళ్లకాలంలో కూటమీ ప్రభుత్వం మొండితోక బ్రదర్స్ పై 13 కేసు నమోదు చేసిందని ఆరోపించారు.కూటమీ ప్రభుత్వం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రోత్బలం తోనే కేసుల పరంపర కొనసాగుతుందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ ఆరోపించారు.
Next Story




