Kankipadu: నేత్రదానంతో చీకటి నిండిన జీవితాల్లో వెలుగులు కిషోర్ బాబు!

Kankipadu: ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్యశాలలో 41వ జాతీయ నేత్రదాన అవగాహన పక్షోత్సవాలు. నేత్రదాన సేవలకై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న కిషోర్ బాబు.

Ramana, Penamaluru
Published on: 4 Sept 2026 11:40 AM IST
Kankipadu
X

Kankipadu: నేత్రదానంతో చీకటి నిండిన జీవితాల్లో వెలుగులు కిషోర్ బాబు!

Kankipadu: మనం చూస్తున్న ఈ అందమైన ప్రపంచాన్ని, దృష్టి లోపం ఉన్న వారు కూడా చూసి ఆనందించేలా చేయగల సులువైన మార్గం నేత్రదానం చేయడానికి ముందుకు రావడమే అని కంకిపాడు ప్రభుత్వాసుపత్రి మాజీ చైర్మన్, ఎన్టీఆర్ సేవారత్న అవార్డు గ్రహీత యలమంచిలి కిషోర్ బాబు అన్నారు.

41వ జాతీయ నేత్రదాన అవగాహనా పక్షోత్సవాల్లో భాగంగా ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్యశాలలో నిర్వహించిన కార్యక్రమంలో, నేత్ర దానంపై అవగాహన కల్పించడం, మరణించిన వారి నేత్రాలను సకాలంలో సేకరించేలా పాటుపడటం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నందుకు గాను స్థానిక శాసనసభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు వృద్ధులపై ప్రభావం చూపే నేత్ర సంబంధ వ్యాధులు, మొబైల్ ఫోన్లు/ల్యాప్ టాప్స్/టీవీల మితిమీరిన వినియోగం వలన, యువతతో పాటు చిన్నారుల్లోనూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతీ ఒక్కరం నేత్ర దానం చేయడానికి ముందుకు రావడం ద్వారా, మరికొందరికి చూపును ప్రసాదించడమే కాకుండా మరణించిన తరువాత కూడా మన కళ్ళ ద్వారా మనం కన్న కలలను సజీవంగా కొనసాగించవచ్చన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని, నేత్ర దానం చేయడం ద్వారా చీకటి నిండిన జీవితాలకు క్రొంగొత్త వెలుగులు నింపుదామంటూ సభికులతో ప్రమాణం చేయించారు.

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story