Vuyyuru: వినాయక చవితికి సింగిల్ విండో అనుమతులు సద్వినియోగం చేసుకోవాలి!
Vuyyuru: వినాయక చవితి ఉత్సవాలకు సింగిల్ విండో అనుమతి విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా నాయకులు మెరుగు చిన్నకోటయ్య ఉయ్యూరు సమావేశంలో సూచించారు.
Vuyyuru: వినాయక చవితికి సింగిల్ విండో అనుమతులు సద్వినియోగం చేసుకోవాలి!
Vuyyuru: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో అనుమతి విధానాన్ని ఉత్సవ కమిటీలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణాజిల్లా అధ్యక్షులు మెరుగు చిన్నకోటయ్య సూచించారు.
ఉయ్యూరు మండల అధ్యక్షుడు టోనీ, ఉయ్యూరు పట్టణ అధ్యక్షుడు బుజ్జి సమక్షంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, కృష్ణాజిల్లా అధ్యక్షులు మెరుగు చిన్నకోటయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన అనుమతి విధానం, ఉత్సవ కమిటీలు పాటించాల్సిన నిబంధనలపై చర్చించారు.
వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులను సులభతరం చేసేందుకు అన్ని పర్మిషన్లను ఒకే ఫామ్ ద్వారా పొందే విధంగా కూటమి ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసిందని చిన్నకోటయ్య తెలిపారు. ఉత్సవ కమిటీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుగానే అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉయ్యూరు పట్టణం, ఉయ్యూరు మండల పరిధిలోని వినాయక చవితి ఉత్సవ కమిటీలు తమను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన అనుమతులు పొందేలా సహకరిస్తామని తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు ప్రతి కమిటీ బాధ్యతగా వ్యవహరించాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు సూచించారు.




