Vuyyuru: ఉయ్యూరులో పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు!

Vuyyuru: ఉయ్యూరు హోటళ్లలో గృహ అవసరాల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వినియోగం. పౌరసరఫరాల శాఖ అధికారుల నిఘాపై ప్రజల ప్రశ్నలు.

Ramana, Penamaluru
Published on: 18 Aug 2026 11:41 AM IST
Vuyyuru
X

Vuyyuru: ఉయ్యూరులో పక్కదారి పడుతున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు!

Vuyyuru: హోటళ్లలో సబ్సిడీ సిలిండర్లు...

ప్రజలకు అందాల్సిన సబ్సిడీ.. హోటళ్లకు చేరుతోందా...?

వాణిజ్య అవసరాలకు గృహ సిలిండర్ల వినియోగం.. అధికారుల తనిఖీలు ఎక్కడ...?

ప్రభుత్వం సామాన్య కుటుంబాలకు అందిస్తున్న సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లను కొన్ని హోటళ్లలో వంటకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. పట్టణంలోని కొన్ని హోటళ్లలో ఈ వ్యవహారం సాగుతోందనే విమర్శలు ఉన్నాయి.

హోటళ్లలో సిలిండర్లు ఎలా వస్తున్నాయి...?

వాణిజ్య సిలిండర్ల స్థానంలో గృహ సిలిండర్లు ఎందుకు...?

గ్యాస్‌ ఏజెన్సీలు.. పౌరసరఫరాల శాఖ అధికారుల నిఘా ఎక్కడ...?

ప్రజలకు అందాల్సిన సబ్సిడీ ప్రయోజనం పక్కదారి పట్టకుండా సంబంధిత అధికారులు హోటళ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి...నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సబ్సిడీ సిలిండర్‌...సామాన్యుడి కోసం కదా..?

హోటళ్లలో వంట కోసం ఎలా...?

Ramana, Penamaluru

Ramana, Penamaluru

Next Story