Vuyyuru: ఉయ్యూరులో దోమల నివారణకు గంబూసియా చేపల పంపిణీ!
Vuyyuru: ఉయ్యూరు మున్సిపల్ పరిధిలోని నిలువ నీటి గుంటలలో దోమల లార్వా నివారణకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గంబూసియా చేపలను విడుదల చేశారు.
Vuyyuru: ఉయ్యూరులో దోమల నివారణకు గంబూసియా చేపల పంపిణీ!
Vuyyuru: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో దోమల అభివృద్ధి చెందకుండా ఉండటానికి వల్లూరు రోడ్లో నిలువ ఉన్న నీళ్లలో గంబుషియ చేపని వదలడం జరిగిందని.
ఇలా వదలడం మూలంగా దోమల లార్వా ని ఈ చేపలు తినేయడం జరుగుతుంది, అందువలన దోమల అభివృద్ధి చందకుండా ఉంటుంది కాబట్టి, ఉయ్యూరులో గుంటలలో నిలువ ఉన్న నీటిలో ఈ చేపలను వేయటం జరుగుతుందని, ఈ విధంగా దోమలని అరికట్టడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్,డాక్టర్ గోపీచంద్,svd రాజన్ రాజ్, హెల్త్ అసిస్టెంట్ శ్రీధర్ కుమార్,ANMS,ASHAS, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




