Vuyyuru: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి!

Vuyyuru: విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీ వర్షానికి అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు. పామర్రు వెళ్తున్న కోటా త్రివిక్రమ్ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం.

Ramana, Penamaluru
Updated on: 13 Sept 2026 1:40 PM IST
Vuyyuru
X

Vuyyuru: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ప్రాణనష్టం తప్పడంతో ఊపిరి!

Vuyyuru: వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో స్వగ్రామమైన పామరుకు బయలుదేరిన ఓ కుటుంబానికి తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై భారీ వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి ఫ్లైఓవర్ డ్రైనేజీ బల్లలపైకి ఎక్కింది.

ప్రమాద సమయంలో కారులో కోటా త్రివిక్రమ్‌తో పాటు కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

భారీ వర్షం కారణంగా రహదారిపై నీరు నిలవడం, వాహనం అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ramana, Penamaluru

Ramana, Penamaluru